దేవయాని ఎమోషనల్ డ్రామా.. రిషి తన భార్యని ఏంజిల్ కి చూపిస్తాడా?
on Sep 23, 2023
.webp)
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ గుప్పెడంత మనసు. ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్- 875 లో.. ఫణీంద్ర, శైలేంద్ర, దేవయాని, మహేంద్ర, జగతి, అందరు కలిసి మాట్లాడుకుంటారు. రిషిని ఎంత బ్రతిమాలినా రాలేదని ఫణీంద్రతో శైలేంద్ర అంటాడు. అవునా.. రిషి ఈ పెద్దమ్మ మాట వింటాడు. నేను చెప్తే వింటాడు.
నేను వెళ్తున్నాను. ఎవరి మాట విననని చెప్పి వెళ్తుంటే తనని ఎవరూ ఆపరు. దాంతో ఎవరు ఆపట్లేదేంటి అని దేవయాని అనుకొని కళ్ళు తిరిగి పడిపోయినట్టు నటిస్తుంది. ఇక అది చూసి శైలేంద్ర మరింత రెచ్చిపోయి .. అయ్యో మమ్మీ ఏమైంది. తమ్ముడి కోసం ఇంతలా ఆలోచించాలా వస్తాడులే అని దేవయానితో శైలేంద్ర అంటాడు. ఇక సృహ తప్పిపోయినట్టుగా దేవయాని నటించి కాసేపటికి కళ్ళు తెరుస్తుంది. అదంతా చూసిన ఫణీంద్ర నమ్మేసి.. దేవయానిని తమ గదిలోకి తీసుకెళ్ళమని శైలేంద్ర, ధరణిలతో చెప్తాడు. వాళ్ళిద్దరు కలిసి దేవయానిని తన గదిలోకి తీసుకెళ్తారు.
మరొకవైపు పాండియన్ ఇంట్లో ఉన్న రిషికి కావలసిన విధంగా భోజనం వడ్డించి, రిషి ఉండే గదిని అందంగా అలంకరిస్తుంది వసుధార. ఇక అదంతా చూసిన రిషి.. వసుధార మేడమ్ కదా ఇదంతా చేసిందని పాండియన్ తో అంటాడు. కాదని పాండియన్ చెప్పే ప్రయత్నం చేయగా.. నువ్వేం అబద్ధాలు చెప్పకు తనే చేసింది నాకు తెలుసని పాండియన్ తో రిషి అంటాడు. ఆ తర్వాత వసుధార దగ్గరికి పాండియన్ వచ్చి.. మీరే ఇదంతా చేస్తున్నారని తెలిసిపోయింది మేడమ్ అని అంటాడు. అవునా.. ఏం పర్లేదులే అని వసుధార అంటుంది.
నాకొక డౌట్ ఉంది మేడమ్ అని వసుధారతో పాండియన్ అంటాడు. ఒకరిని ఎవరైనా ఇష్టపడితేనో, దగ్గరివాళ్ళైతేనో వారి ఇష్టాలు, అభిరుచులు తెలుస్తాయి కదా మేడమ్ అని వసుధారతో పాండియన్ అనగా.. హా అవునని వసుధార అంటుంది. అదే రిషి సర్ మీరే చేశారని అలా ఎలా చెప్పాడు మీకు ముందే పరిచయం ఉందా? మీ ఇద్దరి మధ్య ఏమైనా బంధం ఉందా అని పాండియన్ అడుగుతాడు. అదేం లేదు. రిషి సర్ స్మార్ట్, ఇంటలిజెంట్ అతన్ని ఎవరైనా ఇష్టపడతారని వసుధార కవర్ చేస్తుంది. ఆ తర్వాత రిషికి పాండియన్ భోజనం తీసుకెళ్ళగా అది తిన్న రిషి.. వసుధార మేడమ్ ఇవన్నీ చేసిందని నాకు తెలుసు, నేను తినేవరకు తను వెళ్ళదని తెలుసని పాండియన్ ని తీసుకురమ్మని చెప్తాడు. ఇక బయటకు వచ్చిన పాండియన్ వసుధార దగ్గరికి వచ్చి.. రిషి సర్ రమ్మంటున్నాడని చెప్తాడు. అవునా అని రిషి దగ్గరికి వసుధార వెళ్తుంది. నా బాగోగులు ఎందుకు చూసుకుంటున్నావ్? నేనెక్కడుంటే అక్కడికి వస్తున్నావు ఎందుకని రిషి అడుగుతాడు. మీరెక్కడుంటే నేనక్కడుంటానని వసుధార అంటుంది. ఆ తర్వాత ఇద్దరు కలిసి భోజనం చేస్తారు. అదే విషయం వసుధార వాళ్ళ నాన్న చక్రపాణికి రిషి కాల్ చేసి చెప్తాడు.
మరుసటి రోజు ఉదయం ఏంజిల్ ని తీసుకొని వసుధార వస్తుంది. ఏంజిల్ ని చూసిన రిషి షాకవుతాడు. నువ్వెందుకొచ్చావని రిషి అనగా.. అదేంటి రిషి అలా మాట్లాడతావని ఏంజిల్ అంటుంది. మనిద్దరి మధ్య ఉంది స్నేహం మాత్రమే.. నువ్వెప్పటికి నాకు మంచి స్నేహితురాలివేనని రిషి అంటాడు. నీ భార్య గురించి నాకు చెప్తానన్నావ్, ఆ గడువు దగ్గరికొచ్చింది. నువ్వు చెప్పలేకపోతే నన్నే పెళ్ళి చేసుకోవాలని ఏంజిల్ చెప్పేసి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత వసుధార కూడా రిషిని అదే ప్రశ్న అడుగుతుంది. దాంతో ఇక్కడి నుండి వెళ్ళిపోమని వసుధారతో రిషి చెప్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



